Rangasthalam---Thank-You-Letter-to-Ram-Charan-for-Washing-Dishes‘రంగస్థలం’ ముందువరకు రామ్ చరణ్ ను ఒక నటుడిగా గుర్తించని వారంతా, ప్రస్తుతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘రంగస్థలం’లో సుకుమార్ అంత అద్భుతంగా రామ్ చరణ్ ను తీర్చిదిద్దారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లు… ఈ క్యారెక్టర్ ను రామ్ చరణ్ తప్ప మరొక హీరో అంత గొప్పగా చేయలేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతలా ‘చిట్టిబాబు’ను ప్రేక్షకులకు రుచిచూపించాడు.

అయితే ఇన్నాళ్ళు ఈ రామ్ చరణ్ అభినయం అంతా ఏమైపోయింది? కేవలం తండ్రి చాటు బిడ్డగా, చిరు వారసత్వంతో కొట్టుకువస్తున్న రామ్ చరణ్ ప్రతిభను ఎవరూ గుర్తించలేదా? అంటే సుకుమార్ అయితే.. ‘ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యంగా రామ్ చరణ్ ను అభివర్ణించారు. సరైన క్యారెక్టర్ పడితే రామ్ చరణ్ ఏం చేయగలడో నిరూపించిన సినిమాగా రంగస్థలంను కీర్తించారు.

రామ్ చరణ్ పై చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల ప్రభావం లేదని, ఆయకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉందని, నిజంగా చెప్పాలంటే… చిరంజీవి, పవన్ లు చేయలేని కొన్ని సీన్లు రామ్ చరణ్ చేయగలడని, కొన్ని సీన్లకైతే మేం షూటింగ్ లొకేషన్లలోనే చప్పట్లు కొట్టేసేవారమని, ఇప్పుడు ధియేటర్లలో ఎంజాయ్ చేస్తున్న సీన్లన్నీ మేం అప్పుడే ఎంజాయ్ చేసామని సుకుమార్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదేమీ రామ్ చరణ్ గురించి ఎక్కువ చెప్పడం లేదని కూడా స్పష్టం చేసారు.