Ram Charan Rangasthalam 1985 Movie Set పల్లెటూళ్లలో పచ్చదనమే కాదు .. ప్రేమానురాగాలు కనిపిస్తాయి. ఆత్మీయతతో కూడిన పలకరింపులు వినిపిస్తాయి. చిన్నప్పుడు బంధువుల ఇంటికని పల్లెటూళ్లకు వెళితే, ఆ జ్ఞాపకాలు జీవితాంతం అందమైన అనుభూతులను పంచుతూనే ఉంటాయి. అలాంటి అనుభూతే తన సినిమా విలేజ్ సెట్ చూస్తే కలుగుతోందంటూ తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా చెప్పాడు.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న “రంగస్థలం” గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడంతో హైదరాబాద్ లో వేసిన 1980 కాలం నాటి విలేజ్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ స్పాట్ కి సంబంధించి, పల్లెలోని ఓ వీధి .. పూరిపాక .. కిరాణా కొట్టు .. సోడా బండీ ఫోటోలను ఫేస్ బుక్ లో చరణ్ పోస్ట్ చేశాడు. ఈ విలేజ్ సెట్ చూస్తే 1980 నాటి కాలానికి మీరు వెళతారనీ, తనని కూడా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళుతోందని చెప్పాడు.