Ram-Charan Character in RRR‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదల దగ్గరయ్యే కొద్దీ రాజమౌళి ప్రమోషన్ల జోరు పెంచుతున్నారు. అర్జునరెడ్డితో… బాహుబలి అంటూ సందీప్ రెడ్డి వంగాతో రాజమౌళి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ల మాదిరి కాకుండా ఒక దర్శకుడి కోణంలో ప్రశ్నలు సంధించారు వంగా.

‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ చూసిన తనకు రామ్ చరణ్ ఒక ‘దయా దాక్షణ్యాలు’ లేని ఒక పోలీస్ అధికారిగా కనిపించారని, దాని గురించి చెప్పమని అడిగారు. అందుకు రాజమౌళి అవును ఒక కాఠిన్యం కలిగిన పోలీస్ పాత్రను రామ్ చరణ్ అద్భుతంగా పండించాడని అందుకు రామ్ చరణ్ చాలా శ్రమించారని తెలిపారు.

పోలీస్ పాత్రలో ఉన్న రామ్ చరణ్ ప్రజలను కొట్టేటప్పుడు కళ్ళలో బాధను., ముఖంలో కాఠిన్యాన్ని చూపాలనే లైన్ చెప్పడంతో అందుకున్న రామ్ రెండు ఎమోషన్స్ ను ఒకే షాట్ లో కనపరిచారంటూ తన రాముడి పై తన ప్రేమను తెలిపారు రాజమౌళి. ప్రజలను కొట్టే తప్పుడు వారి ముఖాలను చూడకుండా ఎక్కడో దూరంగా చూస్తూ కాఠిన్యతను చూపాలని అడిగాను.

ఇచ్చిన సందర్భాన్ని యధావిధిగా తెర మీద పండించ్చారు నా రాముడు., భీముడు అంటూ తన ఇద్దరి హీరోలను ఆకాశానికి ఎత్తేసారూ రాజమౌళి. అల్లాగే ఎన్టీఆర్ VS టైగర్ సీన్ ని కూడా కొనియాడారు వంగా సందీప్. ఎంతైనా ఒక దర్శకుడి కష్టం మరో దర్శకుడికే అర్ధమవుతుంది అన్న విధంగా వీరి సంభాషణ కొనసాగింది.