అగ్ర హీరోలకు అభిమానుల అండే తరగని కొండ. వారిని మెప్పించే సినిమాలు చేయటానికి వారు ప్రయత్నిస్తుంటారు. ఈ అభిమానులు మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అని కొట్టుకుంటూనే ఉంటారు. ఒకప్పుడు డైరెక్ట్‌గా కొట్టుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు. మాధ్యమం మారిందే తప్ప.. కొట్టుకోవటం, తిట్టుకోవటం అనే కాన్సెప్ట్ మారలేదండోయ్. ఇలాంటి ఫ్యాన్ వార్‌ను మనం చాలా మంది స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య మనం గమనించే ఉంటాం. రీసెంట్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య అలాంటి వార్ జరిగింది. అదేంటి ఆ ఇద్దరూ హీరోల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందిగా.. ఇద్దరూ కలిసి RRR వంటి పాన్ ఇండియా మూవీలోనూ నటించారుగా.. అలాంటి వారి ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకున్నారు? అనే సందేహం రావచ్చు.
అసలు విషయం ఏంటంటే RRR సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ లిస్టులో ఉన్నట్లు కొన్ని రోజుల ముందు వైరెటీ మ్యాగజైన్ పేర్కొంది. దీంతో నందమూరి అభిమానులు సందడి చేశారు. తమ హీరోకి ఆస్కార్ అవార్డ్ వస్తుందని నెట్టింట పోస్టులు పెట్టి అభిమానాన్ని చాటుకన్నారు. అయితే RRR రిలీజ్ అయినప్పుడు రామ్‌చరణ్ పాత్రే సినిమాలో హీరో అని, ఎన్టీఆర్ పాత్ర సపోర్టింగ్ రోల్ అనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరైతే ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పారు కూడా. అలాంటి సమయంలో ఎన్టీఆర్ పేరు ఆస్కార్ అవార్డ్స్ యాక్టర్స్ లిస్టులో ఉండటంపై మెగాభిమానులు కొందరు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
ఎన్టీఆర్ అండ్ టీమ్ డబ్బులు ఇచ్చి అలా చేయించుకుందని రామ్ చరణ్ అభిమానులు ఆ సందర్భంలో కామెంట్స్ కూడా పెట్టారు. అయితే ఇదే కామెంట్స్ వారికి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు అదే మ్యాగజైన్ రామ్ చరణ్ పేరు కూడా ఆస్కార్ బెస్ట్ యాక్టర్స్ లిస్టులో ఉందంటూ పేర్కొంది. తమ అభిమాన హీరో పేరు ఆస్కార్ బెస్ట్ యాక్టర్స్ లిస్టులో ఉండటంపై రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హ్యాష్ ట్యాగ్ ఆస్కార్ ఫర్ రామ్‌చరణ్ పేరుతో ట్రెండ్ చేస్తున్నారు.
అయితే రామ్ చరణ్ అభిమానులు ఇలా చేయటాన్ని కొందరు తప్పు పడుతున్నారు. బెస్ట్ యాక్టర్ లిస్టులో ఎన్టీఆర్ పేరునప్పుడు డబ్బులిచ్చారు.. అదీ ఇదీ అంటూ కామెంట్స్ చేసిన అదే ఫ్యాన్స్ ఇప్పుడు తమ అభిమాన హీరో పేరు వస్తే సంబరాలు చేసుకోవటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రామ్‌చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి తేలుకుట్టిన దొంగలా తయారైంది. గట్టిగా మాట్లాడలేకపోతున్నారు మరి.