Ram Charan - NTR - chief Guests for Bharat Ane Nenu Pre Release function‘భరత్ అనే నేను’ ఆడియో వేడుకపై ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు దృష్టి పెట్టారు. ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను భారీ స్థాయిలో జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఎన్టీఆర్ ను .. చరణ్ ను మహేశ్ ఆహ్వానించనున్నట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దీనికి ఈ ముగ్గురి మధ్య మంచి సాన్నిహిత్యాన్ని హైలైట్ చేస్తుండగా, ఎన్టీఆర్ – చరణ్ లతో కొరటాలకి అనుబంధం ఉండడం మరింత ప్రాధాన్యతను కలిగిస్తోంది. ఇప్పటికే ఆయన ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ చేయగా, మరో సినిమా కూడా పైప్ లైన్ లో ఉంది. అలాగే త్వరలో రామ్ చరణ్ తో కూడా కొరటాల ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.

వీటన్నింటితో పాటు ఎన్టీఆర్ – చరణ్ కలిసి ఓ మల్టీస్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు కూడా ‘భరత్ అనే నేను’ ఆడియో వేడుకకి హాజరైతే, ఘట్టమనేని అభిమానులతో పాటు .. నందమూరి అభిమానులు .. మెగా ఫ్యాన్స్ కూడా ఈ స్టేజ్ ముందు చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇది పుకారా? నిజమా? అన్నది చిత్ర యూనిట్ ఖరారు చేయాలి.