Ram Charanabout producersమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒకానొక ఇంటర్వ్యూ లో తమ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ గురించి మాట్లాడుతూ తానూ తన బ్యానర్ లో అసలు వేరే హీరోలతో సినిమాలు చెయ్యం అని, సొంత బ్యానర్ లో తాను కూడా సినిమా చెయ్యను అని, చెప్పేశాడు. అయితే దానికి గల కారణం కూడా చెప్పేశాడు..అదేంటి అంటే…

నా చుట్టూ చాలామంచి ఉన్నారు అంటూ నిర్మాతల విషయంలో సరికొత్త అర్ధాన్ని చెప్పాడు చెర్రీ. అయితే చెర్రీ చెప్పింది కాస్త వెటకారంగా అనిపిస్తున్నా..ఆయన మాటల్లో అర్ధం వేరులే. చెర్రీ చెప్పేది ఏంటి అంటే తనతో సినిమాలు చెయ్యడానికి చాల మంది నిర్మాతలే ఉన్నారు. అయితే చిరుతో మాత్రం తానే సొంత బ్యానర్ లో తన స్వార్ధం కోసం సినిమా తీస్తున్నాడట. ఆ లెక్కల్లో చిరుతో సినిమా చెయ్యడానికి నిర్మాతలు లేరు అని కాదండోయ్..

అయితే చెర్రీ ఒక బడా సెలెబ్రెటీ కావడంతో మాట్లాడే విషయంలో కాస్త ఆచి తూచి మాట్లాడటం మంచిది,లేదంటే లేని పోనీ ఇబ్బందులు తప్పవు. ఇక ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పటివరకూ చెర్రీ తన బ్యానర్ లో నెక్స్ట్ సినిమా అక్కినేని హీరోతో చేస్తున్నాడు అని వార్తలు వినిపించిన తరుణంలో ఈ ఒక్క స్టేట్మెంట్ తో మొత్తంగా అసలు గుట్టు విప్పేసాడు అని చెప్పవచ్చు.