Ram charan next movie with Chiranjeeviసుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. ఈ సందర్భంగా మెగా అభిమానులను ఆనందంలో ముంచెత్తే న్యూస్ ను చెర్రీ ప్రకటించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 151వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కావడంతో, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో మునిగిపోయారు.

షెడ్యూల్ ముగింపు సందర్భంగా తిరిగి హైదరాబాద్ పయనమవనున్న రామ్ చరణ్ అభిమానులను కలిసిన సందర్భంలో… చిరు 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆగష్టు నుండి ప్రారంభం కానుందని, ఈ సినిమాను కూడా తానే నిర్మించబోతున్నట్లు చెప్పడంతో మండుటెండలో కూడా ఫ్యాన్స్ చిందులు వేసారు. ఈ సందర్భంగా చిరు – చరణ్ ల స్కెచ్ ఫోటోను అభిమానులు చెర్రీకి బహుకరించారు.

మన తెలుగు నేలపై ఉన్న అందమైన లొకేషన్లలో షూటింగ్ చేయడం మధురానుభూతిని కలిగించిందని, ఇంత సమ్మర్ లోనూ చిత్ర యూనిట్ పని చేసిన విధానం అభినందనీయం అంటూ సోషల్ మీడియాలోనూ చెర్రీ తన భావాలను పోస్ట్ చేసారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా మెగా ఫ్యాన్స్ కు చెర్రీ ‘బాయ్’ చెప్తున్నట్లుగా గోదావరిలో చిత్రీకరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.