Boyapati - Ram Charan
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ‘రంగస్థలం’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో చరణ్ మాట్లాడుతూ… తన తదుపరి సినిమాలను గురించి ప్రస్తావించాడు. ‘రంగస్థలం’ తరువాత తన నెక్స్ట్ మూవీ బోయపాటి శ్రీనుతో చేస్తున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టి దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చూసే ఆలోచనతో వున్నానని అన్నాడు.

ఈ సినిమా తరువాత రాజమౌళితో మల్టీ స్టారర్ చేయనున్నాను. ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఎదిగిన కొరటాల శివతోనూ ఓ సినిమా ఉంటుందని, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు కసరత్తు పూర్తయిన తరువాత తెలియజేస్తానని అన్నాడు. కొరటాల – చరణ్ కాంబినేషన్లోని సినిమా కొంతకాలం క్రితమే రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ సారి ఈ కాంబినేషన్ తప్పకుండా సెట్స్ పైకి వెళుతుందనే నమ్మకాన్ని చెర్రీ వ్యక్తం చేసాడు.