Ram Charan Natu Natu Steps With Keerthi Suresh మెగాస్టార్ చిరంజీవి హాజరు కావాల్సిన “గుడ్ లక్ సఖి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. చిరుకు కరోనా సోకడంతో, మెగాస్టార్ స్థానంలో రామ్ చరణ్ విచ్చేసి తండ్రి స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేసారు. ఈ వేదికపై రామ్ చరణ్ మరియు హీరోయిన్ కీర్తి సురేష్ లు వేసిన ‘నాటు నాటు’ పాట స్టెప్ లు హైలైట్ గా నిలిచాయి.

“ఆర్ఆర్ఆర్”కు సంబంధించిన వివిధ ప్రమోషన్స్ లో ఈ ‘నాటు నాటు’ పాట స్టెప్ లను జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి స్టేజ్ లపై వేశారు. కానీ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులను పర్ ఫెక్ట్ గా వేయగా, రామ్ చరణ్ మాత్రం జూనియర్ తో మ్యాచ్ చేయలేకపోయారు. తనకు పేర్లే గుర్తుండవు, స్టెప్పులు ఎక్కడ గుర్తుంటాయని ఒకానొక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చెప్పేసారు కూడా!

నాడు తారక్ మాత్రం “ఆర్ఆర్ఆర్” సినిమాలో వేసింది వేసినట్లుగా స్టెప్పులను దించేయడంతో సోషల్ మీడియాలో జూనియర్ – తారక్ లు పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పుడు తారక్ డామినేట్ చేసినా, నేడు కీర్తి సురేష్ తో వేసిన స్టెప్పులను మాత్రం రామ్ చరణ్ అదరగొట్టాడు. అందుకే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

సహజంగా టాలీవుడ్ అగ్ర హీరోలు ఇలా వేడుకలపై స్టెప్పులు వేయరు. ఇలాంటి ప్రమోషన్స్ కు బాలీవుడ్ హీరోలు పెట్టింది పేరు. బాలీవుడ్ నాట అయితే స్టేజ్ పైనే హీరోయిన్లను ఎత్తుకోవడం, స్టేజ్ పైనే ముద్దులు పెట్టుకోవడం అనేది చాలా సహజం. ఒక రకంగా పబ్లిసిటీ స్టంట్స్ గా పరిగణించవచ్చు. తెలుగు నాట మాత్రం ఇప్పుడిప్పుడే ఇలా హీరోయిన్లతో హీరోలు కాలు కదుపుతున్నారు.

https://twitter.com/MilagroMovies/status/1486381299799511041