RRR-Latest-Schedule-Cancelled-Due-To-Ram-Charanభారతీయ చలన చిత్రాల అత్యున్నత పురస్కారాలు – భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు వచ్చే వారం ప్రకటించబోతున్నట్టు సమాచారం. మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 2018లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటిస్తారు. ఈ ఏడాది రేసులో రంగస్థలం, గీత గోవిందం, చిలసౌ లాంటి చిత్రాలతో పాటు కేర్ అఫ్ కంచరపాలెం వంటి సినిమాలు కూడా ఉన్నాయని సమాచారం.

ఉత్తమ తెలుగు సినిమా కింద రంగస్థలం, గీత గోవిందం, చిలసౌ రేసులో ఉన్నట్టు సమాచారం వస్తుంది. గత సంవత్సరం బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాకు అవార్డుల పంట పండింది. బాహుబలి 2కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీల్లో బాహుబలి 2 అవార్డులు దక్కించుకుంది. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ నిలిచింది. దీనితో ఈ సారి ఇచ్చే అవార్డులు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి.

మే 3వ తారీఖున విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. ఈ సారి మెగా అభిమానులు రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకు అవార్డుల పంట పండుతుందని భావిస్తున్నారు. ఆ చిత్రం రామ్ చరణ్ నటన ఆయన కెరీర్ లోనే బెస్టు అని విమర్శకులు కూడా అభిప్రాయపడ్డారు. సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయం సాధించింది. దీనితో వారు చాలా ఆశలే పెట్టుకున్నారు. వారిది అత్యాశో కాదో ఆ రోజు (వచ్చే మంగళవారం) తెలిసిపోతుంది.