Ram Charan looks like Allu arjun‘ఎవడు’ సినిమాలో చనిపోయిన అల్లు అర్జున్ స్థానంలోకి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తారు. కధ అంతా అల్లు అర్జున్ ది అయితే కధనం అంతా రామ్ చరణ్ ది. అలా బావ-బావమరుదుల కలయిక ‘ఎవడు’ సినిమాను బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. అయితే తన కొత్త సినిమా “ధృవ” కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ లుక్ ‘సరైనోడు’లో అల్లు అర్జున్ లుక్ ను పోలినట్లు ఉండడం విశేషం.

ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ‘ధృవ’ ఫోటోలలో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా కనపడుతున్నారు. అయితే ఇదే లుక్ తో బన్నీ ‘రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు’లలో కనపడడంతో… సక్సెస్ లో ఉన్న బన్నీని మెగాస్టార్ తనయుడు ఫాలో అవుతున్నట్లుగా కనపడుతోంది. దీనికి మరింత బలం ఇచ్చేలా జానీ మాస్టర్ చెర్రీతో తీసుకున్న సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

“చాలా కాలం తర్వాత రామ్ చరణ్ ను ‘ధృవ’ కోసం కలుసుకున్నానని, మీతో చిట్ చాట్ చేయడం మంచి అనుభూతి కలిగేలా చేస్తుందని” కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెర్రీతో ఉన్న సెల్ఫీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ ఫోటోలో కూడా బన్నీ లుక్ చెర్రీలో స్పష్టంగా కనపడుతోందని నెటిజన్లు అంటున్నారు.