Ram Charan - Jr NTR - RRR Movieబాబోయ్…ఇదేం మీడియారా బాబు అంటూ రాజమౌళి తల పట్టుకుంటున్నాడట. ఇదేం గొడవరా బాబు, నన్ను ప్రశాంతంగా షూటింగ్ చేసుకొనివ్వరా అంటూ తెగ ఫీల్ అయిపోతున్నాడట. ఇంతకీ అసలు ఏం జరిగింది అని కాస్త క్లుప్తంగా లోపలికి వెళితే…

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ “ఆర్.ఆర్.ఆర్” విషయంలో ఇద్దరు హీరో, రాజమౌళి మినహా సినిమాకు సంభందించి ఏ వార్త రాజమౌళి బయటకు చెప్పలేదు. కానీ మీడియా మాత్రం, ఉడికీ ఉడకని వార్తలు తమకు నచ్చినట్లుగా రాసుకుంటూ వారికి కావలసిన వ్యూస్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. కొందరు ఈ సినిమా కధ ఇలా ఉండబోతుంది అని అంటూ ఉంటే, మరి కొందరు ఈ సినిమా ఎన్టీఆర్ విలన్ అంటున్నారు. ఇంకొందరు రాజమౌళి ఎన్టీఆర్ కి అన్యాయం చేశాడు అంటూ కాంట్రొవర్షియల్ టైటిల్స్ పెట్టి షరా మామూలుగా కధలు రాస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ కాస్త లావుగా ఉన్న ఫోటోలు సోషియల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఆ ఫోటోలను ఆధారంగా చేసుకుని ఇదిగో ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ గెటప్ ఇదే అంటూ కధలు రాసేస్తూ ఉన్నారు.

కట్ చేస్తే ఇవన్నీ రాజమౌళికి దృష్టికి చేరగా, ఈ ఫేక్ న్యూస్ తీవ్రత రోజురోజుకీ ఎక్కువైపోతున్న తరుణంలో ఈ సినిమా విషయంలో మరీ అంత గోప్యంగా కాకుండా, మీడియాకు అప్పుడప్పుడు సినిమా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండడం మంచిది అని భావించి, అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలోనే దాన్ని సినిమా పబ్లిసిటీగా కూడా వాడుకుంటే ఎలా ఉంటుంది అని రాజమౌళి ఆలోచన చేస్తున్నట్లుగా ఈ సినిమా యూనిట్ నుంచి వినిపిస్తున్న వార్త.