ram-charan-jr-ntr-movie-rrr-dialoguesఎస్ఎస్ రాజమౌళి యొక్క ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ చిత్రం, ఎన్.టి.ఆర్ మరియు రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది, అయితే కరోనా ప్రభావం కారణంగా జూలై 2021 కి వాయిదా పడింది. ఆర్‌ఆర్‌ఆర్ తమిళ రచయిత, మాధన్ కార్కీ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో అభిమానులను ఉత్సాహపరిచారు.

“బాహుబలికి పది ఒళ్లు గగ్గురపొడిచే సీన్లు ఉంటే, ఆర్ఆర్ఆర్ మొదటి నుండి చివరి వరకు వాటితోనే నిండి ఉంటుంది. రాజమౌళి యొక్క అద్భుతమైన కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను అన్ని రకాలుగా నిమగ్నం చేస్తుంది. ఈ చిత్రంలో అద్భుతమైన విజువల్స్ మరియు ప్రభావంతమైన నేపథ్య స్కోరు ఉంటుంది. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు తిరిగి వెళ్లడానికి ఆర్ఆర్ఆర్ బలమైన కారణం ఇస్తుంది “అని మాధన్ కార్కీ అన్నారు.

అలాగే కథనంలో సంభాషణలు కీలక పాత్ర పోషిస్తాయని, అవి చాలా ప్రభావితం చేసేవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా కనిపించనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ రాబట్టింది.

ఎన్టీఆర్ టీజర్ కూడా విడుదల కావాల్సి ఉన్నా, లాక్ డౌన్ కారణంగా కుదరలేదు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. సరిగ్గా ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సిన టైం లో కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ భామ నటించనుంది.