ram-charan-in-usa-dhruva-premier-showపెద్ద సినిమాలు విడుదలయ్యేటప్పుడు ఆ హీరోల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కువ మంది అయితే ముందుగా ఫస్ట్ టాక్ వెలువడే వరకు ప్రేక్షకులకు దూరంగా ఉంటారు. బాక్సాఫీస్ వద్ద ఫలితం ఏంటో తెలిసిన తర్వాతే కెమెరాను ఫేస్ చేయడానికి ఇష్టపడతారు. మరి ఈ విషయంలో రామ్ చరణ్ ఏం చేస్తాడు? ఎప్పుడూ అయితే ఇంట్లో నుండి బయటకు రావాలన్నా కూడా బాగా టెన్షన్ పడేవాడట చెర్రీ. కానీ, ‘ధృవ’కు మాత్రం అందుకు విరుద్ధంగా రెడ్ కార్పెట్ పై ప్రత్యక్షమయ్యాడు.

యుఎస్ ప్రీమియర్స్ కు హాజరైన రామ్ చరణ్, ఈ విషయాలను స్వయంగా వెల్లడించాడు. ‘ధృవ’ సినిమా బాగా వచ్చిందని, ఇప్పటివరకు తానూ కూడా ఈ సినిమాను చూడలేదని, మీతో పాటు కలిసి చూడడానికి ఇక్కడికి వచ్చానని యుఎస్ అభిమానులతో తన అనుభూతులను పంచుకున్నారు. యుఎస్ లో ఇప్పటివరకు చెర్రీకి మార్కెట్ లేకపోవడంతో, ఎలాగైనా ‘ధృవ’ ద్వారా సొంతం చేసుకోవాలని భావించిన చెర్రీ ఎన్ఆర్ఐ ప్రేక్షకులను పలకరించాడు.

మరి ధైర్యం చేసి ఇంట్లో నుండి ఏకంగా విదేశాలకు వెళ్ళిన చరణ్ కు “ధృవ” ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇది సక్సెస్ అయితే సెంటిమెంట్ పరంగా ప్రతి సినిమాకు ఇలాగే యుఎస్ వెళ్తాడేమో! లేదంటే మరోసారి అటు వైపుగా చూడకపోవచ్చు. అయితే నటించింది రీమేక్ సినిమా కావడంతో చిత్ర యూనిట్ ‘సేఫ్ సైడ్’లో నిలిచే అవకాశాలే ఎక్కువన్నది ట్రేడ్ టాక్.