Ram Charan honest confession on Vinaya Vidheya Rama failureమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సంక్రాంతి సినిమా ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని ఉద్దేశిస్తూ మంగళవారం‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమా ద్వారా మీ అంచనాలను అందుకోలేకపోయామన్నారు. చిత్ర నిర్మాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ “మీ అందరికీ నచ్చి, వినోదం పంచే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాను అందించలేక మీ అంచనాలని అందుకోలేకపోయాం,” అన్నారు చరణ్.

అభిమానులను, ప్రేక్షకులనూ ఉద్దేశిస్తూ, “మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అన్ని వేళలా మద్దతు అందించిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. ప్రేమతో.. మీ రామ్‌చరణ్‌’ అంటూ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఓటమిని ఒప్పుకుని ఒక స్టార్ హీరో ఇటువంటి ప్రకటన చెయ్యడం ఇదే మొదటి సారి.

దీనికి రామ్ చరణ్ ను కచ్చితంగా మెచ్చుకోవలసిందే. 90 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన వినయ విధేయ రామ కేవలం 63 కోట్లు మాత్రమే సంపాదించింది. దీనితో దాదాపుగా 30% లాస్ మూటగట్టుకుంది. సంక్రాంతి సమయంలో రిలీజ్ కాకుండా ఉండుంటే ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండేది. నష్టం సంగతి అటుంచితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల వల్ల రామ్ చరణ్ కు చాలా చెడ్డ పేరు వచ్చింది. దీనిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. రంగస్థలం వంటి భారీ హిట్ తరువాత ఇటువంటి అనుభవం కావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. Ram charan Confession about Vinaya Vidheya Rama

Ram charan Confession about Vinaya Vidheya Rama