Ram Charan from the sets of rangasthalam1985ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బడా హీరోలంతా సినీ వారసులే. అయితే దానిని నిలబెట్టుకోవడానికి ఆయా హీరోలు ఎంతగా శ్రమిస్తున్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా రామ్ చరణ్ తాజా ఉదంతం నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి వారసుడిగా రంగంలోకి దిగిన రామ్ చరణ్, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న “రంగస్థలం 1985” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వేకువజాము నుండి సాయం సంధ్య వేళ వరకు నిర్విరామంగా జరుగుతోంది. అయితే ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే అవుట్ డోర్ షూటింగ్ కావడంతో, తన వలన చిత్ర యూనిట్ మొత్తం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ గాయంతోనే షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.

నిజానికి రామ్ చరణ్ వంటి శ్రీమంతుల బిడ్డలు ఇంతగా శ్రమించాల్సిన అవసరం లేదు. కానీ గాయాన్ని కూడా పక్కనపెట్టి షూటింగ్ లో పాల్గొనడంతో, చిత్ర యూనిట్ కూడా మాంచి ఉత్సాహంతో పని చేస్తోందట. సంక్రాంతికి విడుదల చేయనున్నామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో… ఇలాంటి చిన్న చిన్న దెబ్బలను లెక్క చేయకుండా యూనిట్ వర్గాలలో ఎంతో స్ఫూర్తి నింపుతున్నాడు చెర్రీ.