ram-charan-dhruva-photos“బ్రూస్ లీ” సినిమా ఘోరపరాజయం తర్వాత కాస్త విరామం తీసుకుని, రామ్ చరణ్ నటిస్తున్న “ధృవ” సినిమా ఫస్ట్ టీజర్ అంచనాలను మించి ఉండడంతో, ఈ సినిమా సక్సెస్ పై అభిమానుల్లో ఓ నమ్మకం ఏర్పడింది. దీనికి తోడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ‘ధృవ’ సినిమా స్టిల్స్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రామ్ చరణ్ మేకోవర్ మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి.

అందులో భాగంగా తాజాగా విడుదలైన ఓ ‘ధృవ’ స్టిల్ తో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ పై స్టైలిష్ లుక్ తో ఉన్న ఈ మెగా వారసుడు అదిరిపోయే విధంగా ఉన్నాడంటూ కితబిస్తున్నారు నెటిజన్లు. ఓ మ్యాగ్ జైన్ ‘ధృవ’ సినిమా కవర్ పేజిని ప్రచురించిన సందర్భంగా బయటకు వచ్చిన ఈ స్టిల్ మెగా ఫ్యాన్స్ కు దీపావళి కానుకను పంచుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చెర్రీ పోలీస్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.