Ram Charan Dhruva Diwali Poster Talkదీపావళి ముందు రోజున మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” రూపంలో ఎంట్రీ ఇవ్వగా, పండగ రోజున తనయుడు రామ్ చరణ్ “ధృవ”గా అభిమానులకు కన్నుల విందు చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్ తో కూడిన పోస్టర్ రొమాంటిక్ టచ్ ఇవ్వగా, పిల్లలతో ఉన్న చెర్రీ పోస్టర్ క్లాస్ టచ్ ఇచ్చింది. ఒక విధంగా మెగాస్టార్ ‘మాస్’ టార్గెట్ చేయగా, రామ్ చరణ్ ‘క్లాస్’ ఎంట్రీ ఇచ్చారు.

సహజంగా పండగ పోస్టర్ అంటే ‘శుభాకాంక్షలు’ చెప్తూ ఒక్క పోస్టర్ విడుదల చేస్తుంటారు. కానీ, చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి మాత్రం రెండు రెండు పోస్టర్లను విడుదల చేయడం విశేషం. బహుశా ఇది కూడా ఓ మెగా సెంటిమెంటో, కాకతాళీయమో గానీ, ‘ఖైదీ నంబర్ 150, ధృవ’ సినిమాలు రెండు పోస్టర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆదరణను పొందుతున్నాయి. దీంతో దీపావళి పండగ హడావుడి అంతా మెగా హీరోల పోస్టర్ ఫెస్టివల్ గా మారిపోయింది.