Ram Charan Dhruva copy first look poster ఇటీవల సురేందర్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. చెర్రీ కంటి నుండి వెలువడుతున్న ఫార్ములాలతో నిండిపోయిన పోస్టర్, సరికొత్త అనుభూతులను ఫ్యాన్స్ కు పంచింది. అయితే ఈ సినిమా పోస్టర్ ‘కాపీ’ అని సోషల్ మీడియాలో అసలు పోస్టర్, చెర్రీ పోస్టర్ ను పక్కన పెట్టి మరీ పోస్టులు చేస్తున్నారు.

హాలీవుడ్ సినిమా ‘ఇన్ఫినిటి’ పోస్టర్ లో కూడా సైడ్ ఫేస్ యాంగిల్ తో పాటు, పోస్టర్ నిండా గణిత శాస్త్రపు ఫార్ములాలు నిండి ఉన్నాయి. దీంతో ‘ధృవ’ సినిమా పోస్టర్ ను ఈ సినిమా నుండే కాపీ కొట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఏదైమైనా ప్రస్తుత తరంలో ఒక పోస్టర్ ను విడుదల చేయడం అంటే… బహుశా ప్రపంచంలోని అన్ని సినిమాలు, అన్నీ పోస్టర్లను ఫాలో అవ్వాల్సిందే మరి… అంటున్నారు సినీ జనాలు..!

అయితే ఇలాంటి ‘కాపీ’ విషయాలలో సహజంగా ఎప్పుడూ ప్రచారం చేసే మెగా అభిమానులు డిఫెన్స్ లో పడే విధంగా మెగా వారసుడు రామ్ చరణ్ పోస్టరే ‘కాపీ’ బారిన పడడం విశేషం. దీంతో ఈ పోస్టర్ విషయంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కాస్త సైలెంట్ అయ్యారు.