Ram Charan buy the remake rights of Malayalam Movie Driving Licenceమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దృష్టి ఈ మధ్య మలయాళీ సినిమాల మీద పడినట్టు ఉంది. మొన్న ఆ మధ్య బ్లాక్ బస్టర్ చిత్రం ‘లూసిఫెర్’ రైట్స్ కొన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ఇప్పుడు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన మరో మలయాళం సినిమా రైట్స్ కొన్నట్టు సమాచారం.

మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే చిత్రం రైట్స్ రామ్ చరణ్ ఫ్యాన్సీ అమౌంట్ ఇచ్చి సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ రీమేక్‌ను తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించనున్నాడని టాక్. అయితే ఇది వేరే హీరోలు ఎవరితో అయినా నిర్మిస్తాడా? లేదా మెగా హీరోల్లోనే ఎవరితోనైనా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కథ ఏమిటంటే… ఒక సూపర్ స్టార్ హీరోకు తన డ్రైవింగ్ లైసెన్స్ తప్పక రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మోటార్ వెహికల్ ఆఫీసర్ గా తన వీరాభిమాని ఉండటం విశేషం. అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల వారిద్దరూ బద్దశత్రువులుగా మారిపోతారు. అక్కడ నుండి ఏమైంది అనేది అసలు కథ.

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన అల్లూరి సీతారామారాజుగా కనిపించబోతున్నాడు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం లో ఒక చిన్న పాత్ర కూడా చేస్తున్నాడని సమాచారం.