ram-charan-in-bruce-leeప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ కూడా చాలా ప్రాముఖ్యంగా మారింది. ‘బాహుబలి, శ్రీమంతుడు’ వంటి సినిమాలు తెలుగు సినిమా మార్కెట్ ను చాటి చెప్పడంలో సక్సెస్ కావడంతో, ఒకప్పుడు పట్టించుకోని ఓవర్సీస్ బిజినెస్, ఇప్పుడు చాలా ముఖ్యంగా మారింది. అయితే ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు ఏమిటో అందరికీ తెలిసినవే. కానీ, భారీ డిజాస్టర్లుగా మారిన సినిమాలు మాత్రం అందరికీ తెలియకపోవచ్చు.

అలాంటి జాబితానే సోషల్ మరియు వెబ్ మీడియాలలో హల్చల్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఇప్పటివరకు భారీ నష్టాలను తీసుకువచ్చిన జాబితాలో మెగా వారసుడు రామ్ చరణ్ నటించిన “బ్రూస్ లీ” సినిమా ఉండడం విశేషం. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి – వచ్చిన రాబడితో పోలిస్తే… నెంబర్ 1 స్థానంలో భారీ నష్టం చేకూర్చిన సినిమాగా ‘బ్రూస్ లీ’ నిలిచిందని గణాంకాలు చెప్తున్నాయి. ఒకప్పుడు అత్యధిక వసూళ్ళ జాబితాలో ఉండే మెగా సినిమాలు, ప్రస్తుతం తిరోగమన దిశలో ఉండడం విశేషం.

ఇక, రామ్ చరణ్ ను అనుసరిస్తూ అక్కినేని అఖిల్ నటించిన ఏకైక చిత్రం ‘అఖిల్,’ నందమూరి కళ్యాణ్ రామ్ ‘షేర్,’ కేరింత, శివం, శంకరాభరణం, కొరియర్ బాయ్ కళ్యాణ్, చీకటి రాజ్యం, బందిపోటు, బీరువా తదితర సినిమాలు ఉన్నట్లు సమాచారం. గత రెండు, మూడు నెలలలో విడుదలైన సినిమాల రిపోర్ట్స్ పూర్తి స్థాయిలో రాకపోవడంతో, ఆ సినిమాల కలెక్షన్లను పరిగణనలోనికి తీసుకోలేదు.