post-aravinda-sametha-ram-charan-weakness-to -be-coveredవచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో క్రేజీ ప్రాజెక్ట్ గా భావిస్తున్న బోయపాటి శ్రీను – రామ్ చరణ్ ల సినిమా పబ్లిసిటీ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. మాస్ మెగా హీరోతో బోయపాటి సృష్టించబోయే సంచలనం ఏ విధంగా ఉంటుందోనని మెగా అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వారందరికీ తీపికబురును అందిస్తూ… ఫస్ట్ లుక్ పోస్టర్ ను మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేస్తామని, అలాగే టీజర్ ను నవంబర్ 9వ తేదీన ఉదయం 10.25 గంటలకు రిలీజ్ చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ఓ ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పవర్ ఫుల్ గా ఉండబోతోందని ఈ ప్రీ లుక్ పోస్టర్ చెప్పకనే చెప్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జతగా ‘భరత్ అనే నేను’ ఫేం కైరా అద్వానీ నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సెన్సేషన్ రేపెలా “వినయ విధేయ రామ్” సిద్ధమవుతున్నట్లుగా ట్రేడ్ టాక్.