ram charan birthday hungamaమెగా వారసుడిగా రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ అతి తక్కువ కాలంలోనే ‘స్టార్’ హోదా దక్కించుకుని, మెగాస్టార్ వారసుడిగా నిరూపించుకున్నాడు. అందరికి సాధ్యం కానటువంటి దీనిని అవలీలగా సాధించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు 31వ పుట్టినరోజును జ‌రుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా మెగా అభిమానులు భారీ ఎత్తున రక్త‌దాన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో పాటు తెలుగు వారు ఎక్కడున్నారో అక్కడ భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చిరంజీవితో సహా పలువురు మెగా హీరోలు అభిమానుల కోసం ప్రత్యేకంగా వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే.

మార్చి 28న బెంగళూర్‌ లో శ్రీజ పెళ్లి వేడుక జరగనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మరియు బంధుమిత్రుల సమక్షంలో చెర్రీ తన జన్మదినాన్ని ఈ సారి ప్రత్యేకంగా జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. తన డ్యాన్స్, ప్రసంగాలతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటున్న రామ్ చరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏటా ఘనమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ అభిమానులను ఆకట్టుకోవాలని ఆశిద్దాం.