ram-charan-back-to-pacvillion-with-vinaya-vidheya-ramaరామ్ చరణ్ తేజ్! మంచి మాస్ బలం ఉన్న హీరో…ఎంతైనా మెగాస్టార్ వారసుడు కదా. అయితే మెగాస్టార్ టైం లో ఉన్న ట్రెండ్ వేరు…పవర్ స్టార్ టైం లో ఉన్న ట్రెండ్ వేరు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పక్కా మాస్ మసాలాలు చూడడానికి ప్రేక్షకులు అస్సలు ఇష్టపడటం లేదు. ఎక్కడికక్కడ కొత్తదనం కోరుకుంటున్నారు ప్రేక్షకులు.

అయితే ఆ కోవలోనే ధృవ సినిమాతో మంచి డీసెంట్ హిట్ ఇచ్చాడు చెర్రీ. ఇక ఆ తర్వాత వచ్చిన రంగస్థలం అయితే అసలు చెప్పనవసరమే లేదు…కుమ్మి కుమ్మి వదిలి పెట్టింది బాక్స్ ఆఫీస్ ని. అయితే అలా డిఫరెంట్ కథలతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న చెర్రీ, సడన్ గా బోయపాటి మార్క్ మాస్ కోసం ట్రై చేసి మళ్ళీ కథను మొదటికి తెచ్చుకున్నాడు. చెర్రీ సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడురా అని అనుకునే లోపే, మళ్ళీ డిజాస్టర్ తో అభిమానులకు నిరాశనే మిగిల్చాడు.

అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త రకమైన కధలు ట్రై చేసి, సరికొత్తగా ప్రేక్షకుల ముందు వస్తే కానీ, చెర్రీ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చే అవకాశాలు ఉండవు. మళ్ళీ పక్కా మాస్ కథతో వస్తే మాత్రం మళ్ళీ కష్టమే..మరి చూద్దాం చెర్రీ తప్పును సరిదిద్దుకుంటాడో..లేక షరా మామూలుగా రొటీన్ గానే ముందుకు సాగుతాడో.