Mega-Celebrations-Of-Ram-Charan-Cancelled,-Will-RRR-Follow-Suitగత రెండు రోజులలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి , గెస్ట్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ రెమ్యూనరేషన్లు ఈ సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ వాటాకు సరిపోతాయని ఇక ఈ సినిమాలో ఆయన ఎటువంటి పెట్టుబడి పెట్టనవసరం లేదని వార్తలు వచ్చాయి.

ఈ సినిమా కోసం రామ్ చరణ్ రోజుకు ఒక కోటి వసూలు చేస్తారని, ఈ సినిమా కోసం 30 రోజులు షూట్ చేస్తారని పుకార్లు తెలిపాయి. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న ఇతర ప్రొడక్షన్ హౌస్ మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ చిత్ర నిర్మాణంలో పెట్టుబడుల నుండి అన్ని బాధ్యతలను రెండు నిర్మాణ సంస్థలు సమానంగా పంచుకుంటాయని చెప్పుకొచ్చారు.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ .రామ్ చరన్ కొణిదెల ప్రొడక్షన్ సంస్థకి, మాకు ఎలాంటి విభేదాలు లేవు. సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కలిసి చర్చిస్తున్నాం. కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ అంశం అయిన కూడా ఇద్దరి అంగీకారంతోనే నడుస్తుంది అని పుకార్లకి పులిస్టాప్ పెట్టింది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ గా మొదట్లో త్రిష ను అనుకున్నారు అయితే ఆమె చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చింది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు