Ram charan tani oruvan start date‘గోవిందుడు అందరి వాడెలే, బ్రూస్ లీ’ చిత్రాలతో వరుస పరాజయాలను ఎదుర్కొన్న మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్, ఇటీవల కాస్త గ్యాప్ తీసుకున్నారు. తండ్రి బాటలోనే చెర్రీ కూడా పయనిస్తూ తమిళ సూపర్ హిట్ మూవీ ‘తని ఒరువన్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏ సినిమా చేయాలి అన్న దానిపై తర్జనభర్జనలు పడిన చెర్రీ, ఫైనల్ గా రీమేక్ కే ఓటు వేసాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.

2016 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 16వ తేదీన ‘తని ఒరువన్’ తెలుగు వర్షన్ ప్రారంభం కానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జతగా శృతిహాసన్ కనువిందు చేయనుంది. ఒరిజినల్ వర్షన్ లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన అరవింద్ స్వామియే ఈ సినిమాలోనూ నటించనున్నాడు. ‘రేసుగుర్రం’తో మెగా హీరో అల్లు అర్జున్ కు బంపర్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి తనకు కూడా ఓ భారీ బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకంతో చెర్రీ ఉన్నాడట.