‘బ్రహ్మోత్సవం’ మిస్… ‘స్పైడర్’కు బుక్..!

rakul preet Singh fail to escape from mahesh babu disasterశ్రీకాంత్ అడ్డాల – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్ లో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన “బ్రహ్మోత్సవం” సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ప్రిన్స్ సరసన కనిపించిన ముగ్గురు ముద్దుగుమ్మలలో కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రకు గానూ ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ను అడిగిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో డేట్స్ క్లాష్ కావడంతో, రకుల్ “బ్రహ్మోత్సవం” సినిమాను మిస్ అయ్యానని బహిరంగంగానే వెల్లడించింది. ఈ సందర్భంలోనే ఆ సినిమా సరిగా ఆడలేదని కూడా ప్రస్తావించింది.

అలా ‘బ్రహ్మోత్సవం’ను మిస్ అయిన రకుల్ కు వెంటనే “స్పైడర్” రూపంలో మహేష్ సరసన అవకాశం దక్కడంతో పండగ చేసుకుంది. ప్రిన్స్ తో పాటు మురుగదాస్ మరియు సంతోష్ శివన్ వంటి టాప్ టెక్నికల్ టీం దొరకడంతో మరో మాట లేకుండా ఈ సినిమా ఒప్పేసుకుంది. తీరా ఫలితం దగ్గరకి వస్తే… ప్రిన్స్ అభిమానులను ‘బ్రహ్మోత్సవం’ కంటే ఎక్కువగా నిరాశపరిచిన సినిమాగా మిగిలింది. ఎలాంటి అంచనాలు పెట్టుకోని సాధారణ ప్రేక్షకులు ‘యావరేజ్’ అంటున్నా, అభిమానులను మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.

అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఫలితం ‘బ్రహ్మోత్సవం’ కంటే దారుణంగా మారింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా నిలుస్తుందన్న సంకేతాలు ట్రేడ్ వర్గాలలో బలంగా వినపడుతోంది. ‘బ్రహ్మోత్సవం’తో పోలిస్తే ‘స్పైడర్’ బడ్జెట్ రెండింతలు ఎక్కువ కావడంతోనే ఈ సినిమాకు ఈ స్థాయి నష్టాలను మిగిల్చిందన్నది అసలు విషయం. దీంతో మహేష్ అభిమానులు ప్రస్తుతం కొరటాల శివనే నమ్ముకున్నారు. కనీసం “భరత్ అనే నేను” అయినా తమ ఆశలను తీరుస్తుందేమోనని వచ్చే ఏడాది సమ్మర్ వైపుకు చూస్తున్నారు.

Follow @mirchi9 for more User Comments
Mahesh Babu Talked About Clash with Allu ArjunDon't MissMahesh Talked About Clash with Allu ArjunWhen 'Sarileru Neekevvaru' and 'Ala Vaikumthapurramloo' clash became inevitable, the blame went to Mahesh Babu...Narendra Modi and Amit Shah Leave Jagan Tensed?Don't MissModi and Amit Shah Leave Jagan Tensed?Andhra Pradesh Government is likely to repeal the AP CRDA act in the Assembly on...Mahesh-Babu - Allu ArjunDon't Miss#FakeKaBaapAlluArjun & #FakeQweenMaheshbabu - Shameful!The fan wars in the film industry can turn nasty when it comes to faking...Can-Music-Change-World-Famous--Lover-FateDon't MissCan Music Change World Famous Lover Fate?World Famous Lover is the upcoming film of Vijay Deverkonda. Kranthi Madhav helms the project...RRR Movie Release Date 2nd october 2020Don't MissNew Release Date on the Way for RRRFrom the last few months, there are speculations about a possible change in the Release...
Mirchi9