చక్కని చుక్క కొట్టినా అందమే… మొట్టినా అందమే… అన్నట్టు… చిరిగిన ప్యాంటుతో (అదేలెండి… లేటెస్ట్ ఫ్యాషన్) టాలీవుడ్ హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోడ్డుపై దర్శనమిచ్చింది. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులలో అవగాహన కల్పించేందుకు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో సరదాగా బైక్ నడిపి సందడి చేసింది రకుల్.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నియమ నిబంధనలు పాటించాలని, పోలీస్ అధికారులకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చింది. సినీ హీరోయిన్లు అందాల ప్రదర్శనకే కాదు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కూడా పని చేస్తారని రకుల్ ప్రీత్ సింగ్ వంటి నేటితరం కధానాయికలు నిరూపిస్తున్నారు.