డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందంటూ చెలరేగిన వివాదం నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలో ఒక నెల పాటు క్యాంప్ చేసింది. గత నెల 25 న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఎదుట హాజరైన ఆమె ఆ తరువాత కూడా చాలా రోజులు వైష్ణవ్ తేజ్‌తో కలిసి చేస్తున్న తాజా చిత్రం కోసం షూట్ చేయలేదు.
ఎట్టకేలకు ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చి సోమవారం షూట్‌లో చేరింది. వికారాబాద్ ఫారెస్ట్‌లో ఒక కీలకమైన సన్నివేశం కోసం వర్షం వస్తున్నా ఈ బృందం చిత్రీకరించింది. ఈ షెడ్యూల్‌లో తన భాగాలను పూర్తి చేసిన తర్వాత, ఆమె నితిన్ చెక్ బృందంలో చేరనుంది. పూర్తయ్యే వరకు ఈ చిత్రం కోసం నాన్‌స్టాప్ షూట్ చేస్తుంది.
ఈ రెండు చిత్రాలతో ఆమె కొంత కాలం పాటు హైదరాబాద్ లోనే బిజీగా ఉంటుంది. రకుల్ వైష్ణవ్ తేజ్ చిత్రంలో పల్లెటూరి పిల్లగా కనిపించనుండగా, చంద్రశేఖర్ యెలేటి చెక్ చిత్రంలో లాయర్ పాత్రలో ఆమె నటించనుంది. డ్రగ్స్ కుంభకోణంలో ఆమె పేరు రావడానికి ముందే ఈ ప్రాజెక్టులు ఆమె సంతకం చేసింది.
తెలుగులోని రెండు సినిమాలు కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో చెరో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. మరోవైపు డ్రగ్స్ కేసులో కొంత కాలం నుండి ఎటువంటి కదలికా లేదు. దానితో ఈ సమస్య ఇంతటితో ముగిసిపోయింది అని రకుల్ అభిమానులు అనుకుంటున్నారు.