Rakul Preet Singh - Delhi High courtటాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢీల్లీ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసు విషయంగా మీడియాలో తనపై జరిగిన తప్పుడు ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనను మీడియా వేధింపులకు గురిచేస్తోందని, మీడియాను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు.

మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఇప్పటివరకు తనకు నోటీసు ఇవ్వలేదని, అయితే మీడియాలో కొన్ని మీడియా హౌసులు తనను దురుద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని ఆమె పేర్కొన్నారు. పిటిషన్‌పై స్పందిస్తూ హైకోర్టు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తన వైఖరిని తెలపాలని కోరింది.

ఈ విషయంపై మీడియాను స్వీయ నియంత్రణ పాటించాలని కోరింది. ప్రస్తుతం ఎన్‌సిబి, ఇడి, సిబిఐ దర్యాప్తు చేస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుకు సంబంధించి డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు రియాతో సహా 16 మందిని అరెస్టు చేశారు.

ఎన్‌సిబి దర్యాప్తులో రియా రకుల్, సారా అలీ ఖాన్ మరియు డిజైనర్ సిమోన్ ఖంబట్టా పేర్లను వెల్లడించిందని ఒక ఛానల్ ఒక నివేదికను ప్రసారం చెయ్యడంతో ఈ వివాదం మొదలయ్యింది. అయితే అటువంటిది ఏమీ లేదని ఎన్ సీబీ ఆ తరువాత తేల్చి చెప్పింది. ఇప్పటివరకు ఈ విషయంగా రకుల్ స్పందించలేదు.