Rakul Preet singh - Check Telugu Movieయంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లో లాయర్ పాత్రలో కనిపించింది రకుల్. అసలు ఎటువంటి కమర్షియల్ హంగులు లేని పాత్రను ఒక స్టార్ హీరోయిన్ చెయ్యడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే చెక్ సినిమా ప్రమోషన్స్ లో రకుల్ ఎక్కడా కనిపించలేదు.

సినిమాలోని మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ అంతా తానే అన్నట్టు సినిమాను ప్రమోట్ చేసింది. చిత్ర బృందం కూడా రకుల్ పేరు ప్రమోషన్స్ సమయంలో ఎక్కువగా తీయలేదు. అయితే ఇప్పుడు సినిమా విడుదల అయిపోయింది. బాడ్ టాక్ తో సినిమా ఓపెనింగ్స్ చాలా వీక్ గా వచ్చాయి… వారాంతానికి దుకాణం సర్దడం ఖాయం అన్నట్టు ఉంది పరిస్థితి.

2021లో చెక్ టాలీవుడ్ కు రియల్ డిజాస్టర్ అయ్యింది. ఈ ఏడాది విడుదలైన సినిమాలో ప్లాప్ అయినవి కూడా అనుకున్న దానికంటే బెటర్ గా పే చేశాయి. అయితే చెక్ పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇటువంటి సమయంలో రకుల్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఒక టెక్స్ట్ ఇంటర్వ్యూ మీడియాకి పంపించారు.

అప్పుడు రకుల్ ఎందుకు సినిమా ప్రమోషన్స్ కి రాలేదో… ఇప్పుడు అంతా అయిపోయాకా ఎందుకు వచ్చిందో అర్ధం కాని పరిస్థితి. మరోవైపు… ఆమె ఖాతాలో తెలుగులో ప్రస్తుతానికి వైష్ణవ తేజ్ రెండో సినిమా మాత్రమే ఉంది. ఇంకో రెండు మూడు సినిమాలు ఉన్నాయని వినిపిస్తున్నా ఇంకా అధికారికంగా ధృవీకరింపబడలేదు.