rakul preet singh being trolled by social mediaఏంటో ఈ అభిమానులు, ఎప్పుడు ఎవరిపై ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. హీరోలపై ఉన్న అభిమానంతో ఒక హీరోయిన్ పై దాడులు కూడా చేస్తారా అన్న అనుమానం అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుంది నాకు, కానీ ఈ హీరోల ఫాన్స్ ని చూస్తే మాత్రం వామ్మో, ఇదేంటి ఇంత కోపంగా ఉన్నారు అన్న భయం వేస్తుంది.

అసలు ఇంతకీ విషయం ఏంటి అంటే, హీరోయిన్స్ లిస్ట్ లో టాప్ హీరోయిన్స్ ఎవరు తెలుగులో అని లెక్కా పత్రం బయటకు తీస్తే ఇప్పుడున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఖచ్చితంగా, బలంగా వినిపిస్తుంది. అయితే టాలీవుడ్ టాప్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చెర్రీ ఇలా యువ హీరోలు అందరితో నటించి హిట్స్ అందుకున్న రకుల్. తాజాగా ఒక ట్వీట్ పెట్టింది. అంతే ఇక తగులుకున్నారు ఆ ఇద్దరు హీరో ఫాన్స్…ఇంతకీ రకుల్ పెట్టిన ట్వీట్ ఏంటి? ఏ హీరో ఫాన్స్ ఆమెను టార్గెట్ చేశారు? అంటే టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త మూవీ ఆర్.ఆర్.ఆర్ గురించే. అయితే ఈ సినిమాకి “గుడ్ లక్” చెబుతూ ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్. ఇక తగులుకున్నారు అటు ఎన్టీఆర్, ఇటు చెర్రీ ఫాన్స్…

కొందరు నువ్వు ఎంత ట్రై చేసినా నీకు రాజమౌలు ఆర్.ఆర్.ఆర్ లో రోల్ ఇవ్వడులే కానీ లైట్ తీస్కో అంటూ కామెంట్స్ చేస్తే, మరి కొందరు, తల్లీ చాలమ్మా ఇక మా హీరోనూ వదిలెయ్ అంటూ కామెంట్స్ చేశారు. మరి కొందరు అయితే నువ్వు ఎన్టీఆర్ తో నటించవద్దు అంటూ వార్నింగ్స్ ఇచ్చినట్లుగా కామెంట్స్ చేస్తే, ఇంకొందరు నువ్వు మా హీరోతో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ హల్‌చల్ చేశారు. మొత్తంగా చూస్తే రకుల్ పై అటు ఎన్టీఆర్ ఫాన్స్, ఇటు చెర్రీ ఫాన్స్ చాలా కోపంగానే ఉన్నారు. అయితే ఇక్కడ అర్ధం కానీ లాజిక్ ఏంటి అంటే, అటు ఎన్టీఆర్ తో ఆమె చేసిన నాన్నకు ప్రేమతో కానీ, ఇటు చెర్రీతో ఆమె చేసిన ధృవ కానీ మంచి హిట్ అయ్యాయి, కాకపోతే ఆమె చెర్రీతో చేసిన సెకెండ్ మూవీ బ్రూస్-లీ ఇండస్ట్రీ డిజాస్టర్ కావడంతో ఫాన్స్ ఆమెపై కోపం పెంచుకున్నట్లుగా అర్ధం అవుతుంది.

అంతా బాగానే ఉంది కానీ, “Suppose..For Suppose” రేపు ఈ సినిమాలో ఒక హీరోయిన్ పాత్రకి రకుల్ అయితేనే బావుంటుంది అని రాజమౌళి నమ్మి తనకు ఒక పాత్ర ఇస్తే, మరి ఇప్పుడు తిట్టినొళ్ళే రేపు తెగ పొగిడేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.