Rakul Preet singh Aiyaary Flopటాలీవుడ్ లో ఎన్ని సూపర్ హిట్స్ కొట్టినా… పబ్లిసిటీ పరంగా పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించని రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా బాలీవుడ్ నాట విడుదలైన “ఐయారీ” సినిమా కోసం చాలా తిప్పలు పడింది. ఓ పక్కన హీరో సిద్ధార్ద్ మల్హోత్రాతో కలిసి బహిరంగంగా హాట్ హాట్ ప్రమోషన్స్… మరో పక్కన కళ్ళు తిప్పుకోవడానికి వీల్లేని విధంగా ‘మ్యాగ్జిం’ బొమ్మలు… మొత్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ మూవీ రకుల్ కు పూర్తి స్థాయిలో నిరాశను కలిగించింది.

నిజానికి ‘మ్యాగ్జిం’కిచ్చిన హాట్ హాట్ ఫోటోషూట్ తో రకుల్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. దీంతో “ఐయారీ” సినిమాకు మినిమమ్ ఓపెనింగ్స్ వస్తాయని చిత్ర యూనిట్ తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి. కానీ ‘తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే…’ అన్న చందంగా, మ్యాగ్జిన్ అందాలను వీక్షించిన ప్రేక్షకులు, “ఐయారీ” సినిమాలో రకుల్ ను ఆస్వాదించలేకపోయారు. దీంతో భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ప్రయోజనం లేదనుకుని సదరు ఫోటోషూట్ కు సంబంధించిన ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో కూడా విడుదల చేసారు.

నిజానికి సిద్ధార్ద్ మల్హోత్రా హీరోగా నటించిన గత చిత్రాలు “ఎ జెంటిల్మెన్” (13.13 కోట్లు), “ఇత్తేఫాక్” (16.05 కోట్లు) కంటే తక్కువ ఓపెనింగ్స్ ను ఈ “ఐయారీ” (11.70 కోట్లు) సినిమా సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో మాత్రం పర్వాలేదనిపించేలా 1 మిలియన్ డాలర్స్ ను టచ్ చేయనుంది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ రీ ఎంట్రీ కూడా రకుల్ కు ఏ మాత్రం కలిసి రాలేదు. అయితే ఇక్కడితో వదిలేయకుండా వెంటనే మరో బాలీవుడ్ మూవీ చేయాలనే ఆలోచనలో రకుల్ ఉన్నట్లుగా తెలుస్తోంది.