rakul-preet-out-hebah-patel-in-for-varun-tej-movieశ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన “బ్రూస్ లీ” చిత్రం ఎలాంటి పరాజయాన్ని చవిచూసిందో తెలిసిందే. చెర్రీ కెరీర్ లోనే కాదు, శ్రీనువైట్ల కెరీర్ లో కూడా ‘బ్రూస్ లీ’ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రికార్డులకెక్కింది. ఇదలా ఉంచితే, మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించబోతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం, ‘బ్రూస్ లీ’తో ఫ్లాప్ ఎదుర్కొన్న ఈ కాంభినేషన్ ను పునరావృతం చేయడం ఇష్టం లేక, రకుల్ ను శ్రీనువైట్ల పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ స్థానంలో ‘కుమారి 21ఎఫ్’తో యువతరాన్ని ఒక ఊపు ఊపిన హేబా పటేల్ ను తీసుకున్నట్లుగా సమాచారం. రకుల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫ్లాప్ తో పాటు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడం రేసులో వెనక్కి వెళ్ళడానికి కారణంగా తెలుస్తోంది.

ఈ సినిమాతో కూడా కలిపి ఈ హాట్ చిక్ నాలుగో సినిమాకు తన ఖాతాలో వేసుకుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. మంచు విష్ణు – రాజ్ తరుణ్ మల్టీస్టారర్ ‘ఆడోరకం ఈడోరకం’లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ నిఖిల్ సినిమాలోనూ నటించనుంది. అలాగే ఇటీవల “నేను… నా బాయ్ ఫ్రెండ్స్” చిత్రానికి కూడా సైన్ చేసి వరుస సినిమాలతో టాలీవుడ్ లో సందడి చేస్తోంది.