Rakshasudu -Movie Teaser Talkయువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గత వారం విడుదలైన ఆయన సీత సినిమా కూడా పెద్ద ప్లాప్ గా మిగిలిపోయింది. అయితే గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఆయన తన తదుపరి సినిమా ‘రాక్షసుడు’ ని లైన్ లో పెట్టారు. రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు.

తమిళ సినిమా ‘రాక్షసన్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. శనివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ సైకో స్కూల్ కు వెళ్లే అమ్మాయిలను వరుస హత్యలు చేస్తూ ప్రజల్ని భయపెడుతూ కనిపించాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ‘సింపుల్‌గా చెప్పాలంటే.. వాడో సైకో.. వాడికి నొప్పి అంటే ఏంటో తెలియదనుకుంటా. రాక్షసుడు..’ అని ఓ వైద్యుడు బెల్లంకొండకు విలన్‌ స్వభావం గురించి చెప్పడం సినిమాకు ఎస్సెన్స్ అని చెప్పుకోవాలి.

ఈ రీమేక్ చిత్రంలో తమిళ సినిమాను నేపధ్య సంగీతం, డైలాగులు, విజువల్స్ తో పాటు మక్కీకి మక్కీ దించేశారు. తమిళ మాతృక సినిమాను చూసినవారికి పెద్దగా ఎక్కక పోవచ్చు గానీ మిగతా వారికి ఈ సినిమా బానే ఉండొచ్చు. జులై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంతోనైన బెల్లంకొండ హిట్ కొడతాడేమో చూడాలి. జులైలో సమంత ఓ బేబీ, రామ్ ఇస్మార్ట్ శంకర్, విజయ్ దేవేరకొండ డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.