Rakshasudu Movie Hindi rights (1)ఒక్క హిట్ కూడా లేని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హిట్ సంగతి దేవుడెరుగు మన హీరో గారి ఎకౌంటు కొన్ని కొన్ని ఆణిముత్యాల్లాంటి ప్లాప్ సినిమాలు ఉన్నాయి. అయితే తండ్రి దగ్గర బాగా డబ్బు ఉండటంతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోయిన్లకు భారీ పారితోషికం ఇచ్చి సినిమాలకు హైప్ కోసం ప్రయత్నిస్తాడు బెల్లం బాబు. ఇప్పుడు తాజాగా ఆయన కొత్త సినిమా రాక్షసుడికి కొత్త టెక్నిక్ తో హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. మీడియాలో లీకులు ఇస్తున్నాడు.

ఈ సినిమా హిందీ రైట్స్ 12.5 కోట్లకు కొన్నారట, సెటిలైట్ రైట్స్ ఏకంగా ఆరు కోట్లకు కొన్నారట. అంటే నాన్ – థియేటర్ రైట్ తోనే 18.5 కోట్లు సంపాదించేశారన్నమాట. ఇక సినిమా ఆడినా ఆడకపోయినా ఇబ్బంది లేదు. ఒక్క హిట్ కూడా లేని బెల్లంకొండ కు ఇంత పెడుతున్నారంటే నమ్మే పరిస్థితి ఉందా? హైప్ చేసుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే కొంచెం నమ్మేలా ఉండాలి కదా? ఇటువంటి లీకుల వల్ల ఎవరికి ఉపయోగం? తొందరలో రాక్షసుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.

రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను నిజానికి మొదట నితిన్ చేయాలి కానీ చేయలేదు. ఇప్పుడు అతని ప్లేస్ లో కి బెల్లంకొండ వచ్చాడు. తమిళ చిత్రం ‘రాచ్చసన్’ కి రీమేక్ ఈ రాక్షసుడు. మొన్న ఆ మధ్య ఈ సినిమాలో త‌మిళంలో ఉన్న సీన్లు చాలా వ‌ర‌కూ క‌ట్ పేస్ట్ చేశార‌ని, తెలుగులో షూటింగ్ చేసింది చాలా త‌క్కువ‌ని వార్త‌లొచ్చాయి. అయితే చిత్ర యూనిట్ ఈ వార్తలను ఖండించింది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.