Rajugadu-Theatrical--Trailerహీరోకు ఒక జబ్బు ఉండడం… దాని ద్వారా వినోదాన్ని పండించి హిట్టు కొట్టడం అనేది దర్శకుడు మారుతీ సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారింది. అయితే దీనిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఔత్సాహికులు కూడా కధలను రూపొందించుకుంటున్నారు. గతంలో విడుదలైన ‘రాజుగాడు’ టీజర్ కు కొనసాగింపుగా విడుదలైన ట్రైలర్ ‘ఎంటర్టైన్మెంట్ విత్ డిసీజ్’ అనే కాన్సెప్ట్ పైనే తెరకెక్కింది.

తనకు తెలియకుండానే పక్కనున్న వారివి దొంగిలించే జబ్బు పాత్రలో రాజ్ తరుణ్ నటించాడు. తల్లితండ్రులుగా సితార, రాజేంద్రప్రసాద్ లు నటించగా, వీళ్ళందరితో కూడిన ఫన్నీ సీన్స్ ను కట్ చేసి ట్రైలర్ విడుదల చేసారు. సంజన రెడ్డి దర్శకత్వం వహించిన ఈ రెగ్యులర్ కమర్షియల్ డ్రామా “రాజుగాడు” సినిమాను జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. అమ్య్రా దస్తూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.