ట్రైలర్ టాక్ – సమంత షాట్ ఏదైతే ఉందో..!

Raju Gari Gadhi 2 Movie Trailer Talkఓ ముగ్గురు స్నేహితులు… వెకేషన్… బంగ్లా… దెయ్యం… దానిని చేధించడానికి వచ్చే హీరో… ఇలా ఇప్పటికి ఎన్ని సినిమాలు చూసి ఉంటాం. అయితే ఎన్ని చూసినా ఆసక్తికరంగా చెప్తే… మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం… అదే హార్రర్ మూవీలో ఉన్న స్పెషాలిటీ… దీనినే మరోసారి నిరూపించేందుకు “రాజు గారి గది 2” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలి పార్ట్ అనూహ్య విజయం సాధించడంతో, దర్శకుడు ఓంకార్ కు రెండవ పార్ట్ లో ఏకంగా నాగార్జున, సమంత వంటి భారీ తారాగణం సొంతమైంది.

అక్టోబర్ 13వ తేదీన విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ఏఎన్నార్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. కధ పరంగా ఇప్పటికే ఇంట్రడక్షన్ లో విశదీకరించగా, ఆ కధకు స్టార్ బలం తోడయ్యింది. అలా సాగిపోతున్న ఈ ట్రైలర్ లో సమంతకు సంబంధించిన రెండు షాట్స్ ఉండగా, ఆ రెండు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ మొదట్లో ఆత్మ గాలిలో కలిసిపోయే షాట్ ఒకటి కాగా, రెండవది మాత్రం ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది.

నాగార్జున పెయింటింగ్ వేసిన సమంత బొమ్మ కూడా మాయం కావడం అనేది కొత్తగా ఉండడంతో పాటు, ఈ షాట్ కు థమన్ అందించిన మ్యూజిక్, సీన్ ను బాగా ఎలివేట్ చేసింది. నాగ్ పెయింటింగ్ షాట్ మరియు సమంత మాయమయ్యే షాట్స్ ఏవైతే ఉన్నాయో… సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయని చెప్పవచ్చు. అప్పటివరకు రొటీన్ గా ఉన్న హార్రర్ కామెడీ కాస్త ఆసక్తికరమైన మలుపును తీసుకుంది. దీంతో అక్కినేని అభిమానులు అక్టోబర్ 13 కోసం ఆసక్తిగా నిరీక్షిస్తుంటారని చెప్పడంలో సందేహం లేదు.

Follow @mirchi9 for more User Comments
YS - Jagan - Ramoji RaoDon't MissRamoji Rao's Donations Brings Questions on JaganMedia Baron and Eenadu Group Chairman, Ramoji Rao had announced a donation of 10 Crore...Corona Virus Deaths in US Cross That of 9/11 TollDon't MissCorona Virus Deaths in US Cross That of 9/11 TollThe United States has become the Epicenter of Coronavirus infections across the globe. The country...Deva Katta controversial comments on coronavirus donationsDon't Missవిరాళం ఇవ్వమని ఇండస్ట్రీ లో డిమాండ్ చేస్తున్నారా?కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, పస్తులు ఉంటున్న సినీ కార్మికులకు విరివిగా విరాళాలు ప్రకటించి ఆదర్శప్రాయంగా నిలించారు. తెలుగు...Around 1100 From Andhra Pradesh and Telangana Visits the Epicenter of Corona Cases in India?Don't MissAround 1100 From AP and TS Visits the Epicenter of Corona Cases in India?Over 8000 people from across India and countries like Indonesia, Malaysia, Kyrgyzstan, Bangladesh, etc. attended...Wow,-KCR-Takes-Bravest-Decision--What-About-JaganDon't MissWow, KCR Takes Bravest Decision. What About Jagan?The Coronavirus impact is shattering the economies across the globe. Things are even worse in...
Mirchi9