Rajinikanth voice in 2.0 Movieతలైవార్ రజనీకాంత్ రోబో 2.0 గురించి ఎవరిని అడగవలసిన పనిలేదు. సోషియల్ మీడియాలోకి ఒక్క లుక్ వేస్తే చాలు. సోషియల్ మీడియా అంతా రజనీపై అభిమానం, రోబో 2.0 వీక్షించిన అనుభవాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తున్నారు నెటిజన్స్. అయితే ఈ సినిమాలో అన్నింటికంటే వీ.ఎఫ్.ఎక్స్ మంచి నోట్ తీసుకుంటాయి అని మొదటి నుంచి శంకర్ అండ్ టీమ్ చెబుతూనే ఉన్నారు. ఆ రేంజ్ లోనే ఉన్నాయి వీ.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా. మరో పక్క ఈ సినిమాలో రోబోగా…వశీకరణ్ గా రెండు పాత్రల్లో ఉన్న రాజని వాయిస్ వెనుక చాలా పెద్ద కధే ఉంది అని చెబుతున్నారు ఆ సినిమాకి సౌండ్ ఇంజనీర్ గా పని చేసిన ఆస్కార్ అవార్డ్ విన్నర్ రిసుల్ పోకిశెట్టి.

ఆయన రజని వాయిస్ గురించి మాట్లాడే క్రమంలో ఈ సినిమాలో రజనీకాంత్…అక్షయ్ కుమార్ అన్న పెద్ద స్టార్స్ కన్నా, బలమైన స్టార్ ఇంకొకటి ఉంది అదేంటి అంటే దర్శకుడి శంకర్ “క్రియేటివిటీ”..దానికి ఆ ఇద్దరు స్టార్ట్స్, మరియు మాలాంటి టెక్నికల్ టీమ్స్ మెరుగులు దిద్దారు అంతే. అయితే రజనికాంత్ రోబో తొలి భాగం తీసే సమయంలో రజని వాయిస్ మార్చాలి అన్న విషయం వచ్చినప్పుడు అందరం కాస్త కంగారు పడ్దాం. దర్శకుడు శంకర్ అయితే చాలానే టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న తారల వాయిస్ మారిస్తే సినిమా రిసల్ట్ పూర్తిగా మారిపోయిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఇక అలాంటి సంధర్భాలు గతంలో చాలా చూశాం కూడా. పైగా అప్పటికే అది భారీ బడ్జెట్ సినిమా.

అయితే దానికి ఎలా సెట్ చెయ్యాలి అన్న కోణంలో ఆలోచించి ” Psycho-Acoustic Division” అనే విధానం ద్వారా ఒక నాలుగు, అయిదు రకాల వాయిస్ లను ట్రై చేసి, అందులో ఏది రజనికి సెట్ అవుతుందో అదే పెట్టి ప్రజలను నమ్మించగలిగాం..అదే క్రమంలో మెప్పించగలిగాం కూడా. ఇక ఇదంతా తొలి భాగం కధ. ఇప్పుడు ఈ 2.0 కి ఇటు అక్షయ్, అటు రజని ఇద్దరి వాయిస్ ని ఈ సరికొత్త పద్దతి మార్చడం మాకు పెద్ద రిస్క్ అనిపించలేదు అని తెలిపారు రిసుల్. మొత్తంగా రజని వాయిస్ వెనుక కూడా పెద్ద కధే నడిచింది అని చెప్పవచ్చు.