త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ “జమిలి ఎన్నికలు చాలా మంచి ఆలోచన అని” అభిప్రాయపడ్డారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ… ‘వన్ నేషన్ వన్ పోల్’ ఆలోచన మంచిదేనని, జమిలి ఎన్నికల వల్ల డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని, ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.
సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీ చేసే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తమిళనాడు అవినీతి మయమైపోయిందని బీజేపీ నేత అమిత్ షా చేసిన ఆరోపణల విషయమై ప్రశ్నించగా, రజనీ స్పందిస్తూ… అది అమిత్ షా అభిప్రాయమని, ఈ విషయం గురించి ఆయన్నే అడగాలని చెప్పారు. అయితే మోడీ నిర్ణయానికి రజనీ మద్దతు పలకడంపై భిన్న వాదనలు వినపడుతున్నాయి.