Rajinikanth - Petta - Ajith Viswasamఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కొదమ సింహాలు తమిళ్ బాక్స్ ఆఫీస్ పై విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి..తమిళ తంబీల లెక్కల ప్రకారం చూస్తే..మొదటిగా అటు తలైవర్ రజనీకాంత్ పెట్టా..మరో పక్క తలా అజిత్ విశ్వాసం తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి అని తెలుస్తున్న తరుణంలో ఈ రెండు సినిమాలతోనే తమిళ బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్స్ వర్షం తప్పదు అని అర్ధం అవుతుంది.

అయితే తమిళ సినిమా వర్గాల సమాచారం ప్రకారం సింగం సూర్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న “ఎన్.జీ.కే” కూడా ఈ బరిలో నిలవనుంది అని తెలుస్తుంది. కట్ చేస్తే ఈ మూడు సినిమాలతో నాలుగు రోజుల ముందే బాక్స్ ఆఫీస్ సంక్రాంతి జరుపుకోనుంది అని స్పష్టం చెప్పవచ్చు. అయితే ఇప్పటికి అటు రజని..ఇటు అజిత్ సినిమాల రిలీజ్ డేట్స్ పక్కా కాగా…సూర్య సినిమా రిలీజ్ డేట్ పై కాస్త సందేహాలు నెలకొన్నాయి.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవాల్సిన సినిమానే..కానీ చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం ఈ సినిమా జనవరి చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..మరి అదే జరిగితే సంక్రాతి బరిలో పోటీ పడేది రెండు కొదమ సింహాలే…చూద్దాం మరి ఏం జరగబోతుందో.