Rajinikanth Kamal Haasan,Rajinikanth Kamal Haasan Health Condition,Rajinikanth Calls Kamal Haasan,Rajinikanth Meets Kamal Haasan, Rajini Spoked Kamal Haasanఇటీవల మెట్లపై నుంచి జారిపడి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న కమల్ హాసన్ ను స్వయంగా పరామర్శించాలని భావించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కు నిరాశే ఎదురైంది. గత నెల 13న అమెరికా నుంచి తిరిగొచ్చిన కమల్, ఆపై తన నివాసంలో జారిపడి ప్రస్తుతం చెన్నై, మౌంట్ రోడ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆపరేషన్ తరువాత కూడా కమల్ కాలు నొప్పి తగ్గకపోవడంతో, తాజాగా వైద్యులు మరోసారి ఆపరేషన్ చేశారు. సరిగ్గా ఆ సమయానికే కమల్ ను పరామర్శించేందుకు రజనీకాంత్ వెళ్ళగా, ఆపరేషన్ జరిగినందున కలిసేందుకు వీలుపడదని చెబుతూ, డాక్టర్లు అంగీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక కమల్ కు స్పృహ వచ్చిన తరువాత ఫోన్ లోనే రజనీ మాట్లాడి… త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.