Kabali poster on BMW carజులై 1న విడుదల కాబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ ఫీవర్ ఒక్క తమిళనాడు, ఇండియాలోనే కాదు, విదేశాలకు పాకింది. 25 సంవత్సరాలు గడిచిన ‘భాషా’ సినిమాను గుర్తుకు తెస్తున్న ‘కబాలి’ రాక కోసం అభిమానులు వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఆడియో వేడుక జరిగిన తర్వాత, సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతుంటాయి.

కానీ, ‘కబాలి’ మాత్రం ఇందుకు మినహాయింపు అన్న విషయం స్పష్టమవుతోంది. ఆడియో వేడుకతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ ‘కబాలి’ ప్రేక్షకులకు ఏ మాత్రం చేరువ అయ్యిందో ఈ ‘బిఎండబ్ల్యూ’ కారే చెప్తోంది. మలేషియాలో సందడి చేస్తున్న ఈ కారు బానిట్ పైన దర్శనమిస్తున్న ‘కబాలి’ పోస్టర్ కేక పుట్టిస్తోంది. కోట్ల రూపాయల కారు కంటే ‘కబాలి’ పోస్టర్ పైనే అందరి ఫోకస్ పడుతోందని చెప్పడంలో సందేహం లేదు. రజనీనా… మజాకా..!