Kaala Audio on May 9thసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, అల్లుడు.. హీరో అయిన ధనుష్.. తన సొంత నిర్మాణ సంస్థ ‘వన్డర్ బార్’ పతాకం పై.. పా.రంజిత్ దర్శకత్వం లో నిర్మిస్తున్న ‘కాలా’ సినిమా పాటలు, మే 9 వ తేదీన, విడుదల కాబోతున్నాయి. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో.. అభిమాలతో పాటు.. అందర్నీ ఉర్రూతలూగిస్తుందని, ధనుష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

సంతోష్ నారాయణ్ – రజినీకాంత్ కలయికలో.. ముందుగా వచ్చిన కబాలి సినిమా పాటలు ఎంత హిట్టో అందరికి తెలిసిందే . ‘నిప్పురా’ అంటూ సాగే పాట యు ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. సంతోష్ నారాయణ్ కి ఒక్కసారిగా పేరు తెచ్చించి కబాలి.
తమిళ స్టార్ హీరో విజయ్ – భైరవ సినిమాతో వెంటనే అవకాశం ఇచ్చాడు. తెలుగులో విక్టరీ వెంకటేష్ ‘గురు’ సినిమాకు సంగీతం అందించిన సంతోష్ , కాలా ట్రైలర్ కు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. అదిరింది!. రజిని అభిమానులతో.. టైటిల్ సాంగ్ కు కోరస్ పాడించాడట సంతోష్ నారాయణ్. జూన్ 7 న కాలా సినిమా విడుదల కాబోతున్నది.