rajini-daughter-soundarya-divorceసూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య వైవాహిక జీవితం విడాకుల దిశగా అడుగులు పడుతోందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అశ్విన్ కుమార్ అనే వ్యాపారవేత్తను ఆరేళ్ళ క్రిందట వివాహం చేసుకుని హాయిగా జీవిస్తున్న విషయం తెలిసిందే. అయితే కారణాలు ఏమిటో తెలియదు గానీ, విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో సౌందర్య పిటిషన్ దాఖలు చేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం ఆమె భర్తకు సంబంధించిన కిడ్నీ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళిన సౌందర్య, అక్కడ నుండి రాగానే ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకుంటారనేది చెన్నై వర్గాల టాక్. ఇందులో ఎంత వాస్తవం ఉందో గానీ, సూపర్ స్టార్ ఫ్యామిలీలో చోటు చేసుకుందంటూ జరుగుతున్న ప్రచారంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. ‘కొచ్చాడియన్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సౌందర్య, సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.