Rajinikanth, Rajinikanth Krishna Pushkaralu 2016, Rajinikanth AP Krishna Pushkaralu 2016, Rajinikanth Andhra Pradesh Krishna Pushkaralu 2016, Rajinikanth Guntur Krishna Pushkaralu 2016, Rajinikanth Achampet Krishna Pushkaralu 2016ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక చింతన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా..! అవకాశం చిక్కినప్పుడల్లా హిమాలయాలకు వెళ్ళిపోయే రజనీ భక్తి భావం అభిమానులకు తెలిసిన విషయమే. ఆ భక్తిని మరో సారి చాటుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. తాజాగా జరుగుతున్న కృష్ణానదీమ్మ పుష్కరాల వేడులలో భాగస్వామి అయ్యి, పుణ్య నదిలో పుష్కర స్నానం ఆచరించాలని నిర్ణయించుకున్నారు.

అయితే, సూపర్ స్టార్ ఏ ప్రాంతానికి, ఏ ఘాట్ కు రానున్నారో తెలుసా? భక్తుల రద్దీ అధికంగా ఉంటూ, వీఐపీలు వెల్లువలా వచ్చే విజయవాడకో లేదా శ్రీశైలానికో కాదు. పెద్దగా పేరు లేని గుంటూరు జిల్లా అచ్చంపేట వద్దకు. ఈ జిల్లాలోని అచ్చంపేట మండలంలోని చింతపల్లిలో చాలామందికి తెలియని ఓ దివ్యక్షేత్రం కొలువు తీరి ఉంది. అదే విష్ణు పంచాయతన దివ్య మహా పుణ్య క్షేత్రం.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ క్షేత్రానికే విచ్చేయనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీకి సూపర్ స్టార్ రాకకు సంబంధించిన వర్తమానం కూడా అందింది. రజనీ రాకతో ఈ క్షేత్రానికి మరింత పేరు వస్తుందని ఆశిస్తున్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు. ఒక్క పేరే కాదు, రజనీ వచ్చి వెళ్ళిన నాటి నుండి ఆ ఘాట్ కు భక్తుల రాక కూడా క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.