Rajinikanth 2point0 tamil rockers challengeదాదాపుగా 600 కోట్ల బడ్జెట్ తో ఇండియాలోనే అత్యంత భారీ సినిమాగా తెరకెక్కిన శంకర్ “2.0” సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ రోజునే ‘పైరసీ’ని విడుదల చేస్తామంటూ తమిళ్ రాకర్స్ మరోసారి సవాల్ విసిరారు. గతంలో ఇలాగే పెద్ద సినిమాలకు సవాల్ విసిరి, పైరసీని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల ‘సర్కార్’ మూవీకి కూడా అలాగే ఛాలెంజ్ విసిరి రిలీజ్ చేసిన వైనం తెలిసిందే. మరోపక్కన నడిఘర్ సంఘం అధ్యక్షుడు విశాల్ కు – తమిళ్ రాకర్స్ నడుమ ఓ మినీ యుద్ధమే జరుగుతోంది. కానీ ఈ పైరసీని మాత్రం నియత్రించలేకపోతున్నారు. మరి అదే దెబ్బ 600 కోట్ల మూవీకి తగిలితే, వాటిల్లే నష్టం తీర్చగలిగేదేనా?

పైరసీ అనేది ఖచ్చితంగా నియత్రించాల్సిన అంశమే అయినప్పటికీ, “2.0” అనేది ఒక విజువల్ వండర్ మూవీ గనుక, ఈ సినిమాపై పైరసీ ప్రభావం పడకపోవచ్చు అన్నది ఒక వాదన. గతంలో ‘బాహుబలి 2’ సినిమాను కూడా మొదటి రోజునే రిలీజ్ చేసినప్పటికీ, సినిమా అద్భుతంగా ఉండడంతో దాదాపుగా 1500 కోట్లను కొల్లగొట్టింది. మరి అదే ఫీట్ “2.0” ద్వారా శంకర్ రిపీట్ చేస్తారో లేదో చూడాలి.