Rajinikanth 2.0 Movie Premier Talk--సామాజిక సమస్యలపై తనదైన శైలిలో సినిమా తీసి ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చెయ్యడంలో శంకర్ దిట్ట. అయితే ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాల్లో ఒకటి, రెండు మినహా దాదాపుగా ఎక్కువశాతం అదే రకమైన ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఈ క్రమంలో రోబో తొలి భాగంలో రోబోను చూపిస్తూనే, మరో పక్క చిట్టి పేరుతో మంచి ఎంటర్‌టేన్‌మెంట్ ను అందించాడు శంకర్. ఇక ఆ సినిమాలో రజని రోబో రూపంలో చేసిన హడావిడి, హంగామాను ప్రేక్షకులు భాగా ఎంజాయ్ చేశారు. ఇక రోబో 2.0 గా ఈరోజు మన ముందుకు వచ్చిన రోబో రెండో భాగంలో కూడా శంకర్ తన సామాజిక భాధ్యతని చక్కగా చూపించాడు.

సెల్ ఫోన్ రేడీయేషన్ వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు, వాటి పర్యావసానాలు అన్న కోణంలో కధను ఎంచుకున్న శంకర్ ఈ సినిమాలో సైతం సామాజిక సమస్యకు వీ.ఎఫ్.ఎక్స్ టచ్ ఇచ్చి తాను అనుకున్న ఆలోచననే తెరపై ఆవిష్కరించాడు. అయితే అంత భారీ బడ్జెట్ పెట్టి తీసిన ఈ వీ.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ సినిమాలో కొన్ని చోట్ల బ్రహ్మాండంగా ఉండి…ఔరా ఏం తీశాడురా శంకర్ అనేలా స్క్రీన్ పై నుంచి మన తల తిప్పుకోకుండా చేస్తాయి. అయితే కొన్ని కొన్ని చోట్ల మాత్రం మరీ డీలా పడిపోయిన వీ.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్, కాస్త పిల్లలు చూసే ‘కార్టూన్ నెట్‌వర్క్ కామెడీ సీన్స్’ లా అనిపిస్తాయి. అయితే ఇక్కడ శంకర్ తాను ఏదైతే తీయాలి అని అనుకున్నాడో, దాన్ని స్పష్టంగానే తీసి సక్సెస్ కొట్టాడు అని చెప్పవచ్చు. ఇక అన్నీ పక్కన పెట్టేస్తే, లాస్ట్ లో ఒక సూపెర్ టచ్ ఇచ్చాడు శంకర్. ఈ టచ్ అయితే తలైవార్ ఫాన్స్ నుంచి సినిమా చూసే కామన్ ఆడియన్స్ వరకూ…థియేటర్ నుంచి బయటకు వచ్చే టైమ్ లో ఫుల్ కుషీ అయిపోతారు.

రోబో 3.0 అంటూ ఒక మైక్రో రోబో రూపంలో రజనీకాంత్ స్టైల్ మనరిజంతో ఆ సీన్ సినిమాను పీక్స్ కి తీసుకెళ్లింది అంటే అతిశయోక్తి కాదు. అయితే సినిమాలో కధ బలమైనది కావడం, దానికి తోడు వీ.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ మంచి నోట్ తీసుకోవడం, అన్నీ వెరసి సినిమా మంచి విజయాన్నే అనుకుంది అని చెప్పాలి..ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే రజని ని మైండ్ లో పెట్టుకుని ఫుల్ టైమ్ ఎంటర్‌టేన్‌మెంట్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా చూస్తే మాత్రం కాస్త అంచనాలను అందుకునే అవకాశం ఉండకపోవచ్చు.

మొత్తంగా ఈ సినిమా ఏ సినిమాకు కొడుతుంది? ఏ సినిమా రికార్డులను దాటి కలెక్షన్స్ ప్రవాహం సృష్టిస్తుంది అన్నది కొన్నాళ్ళు గడిస్తే కానీ చెప్పలేం.