Rajinikanth 2.0 Movie Lyca Productions own releaseలైకా సంస్థ గురించి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఆ భారీ సంస్థ గురించి అందరికీ తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థగా ఉన్న లైకా మరో మారు, తలైవార్ రోబో2.0తో మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మన ముందుకు వచ్చేస్తుంది. అయితే సినిమా భారీ రిలీజ్ కి అన్ని సన్నాహాలు జరిగిపోగా, మరో పక్క భారీ రేట్లకే సినిమా అమ్మకం కూడా పూర్తి అయ్యింది. ఇక్కడ ట్విష్ట్ ఏంటి అంటే సినిమాని భారీ రేట్లకే కొన్న వారంతా కాస్త భయంగానే ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త. ఎందుకంటే సినిమా భారీ హిట్ అయితే తప్పితే వాళ్ళ కష్టం వెనక్కి తిరిగిరాదు అని, దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు సినిమాను ఎంతకు కొన్నారో.

ఇదిలా ఉంటే సినిమాపై ఉన్న నమ్మకమో, లేక మన రజని మార్కెట్ పై భరోసానో, లేక శంకర్ దర్శకత్వ ప్రతిభపై ఉన్న నమ్మకమో తెలీదు కానీ ఈ సినిమాని అటు తమిళ నాట, మరో పక్క ఇటు ఓవర్‌సీస్ లో లైకా వారు అమ్మకుండా సొంతంగా రిలీజ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మరో కోణం ఏంటి అంటే, తాజాగా వచ్చిన విజయ్ ‘సర్కార్’ భారీ హిట్ అయినప్పటికీ డిస్‌ట్రిబ్యుటర్స్ మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్లకపోవడంతో, అంత భారీ రేట్స్ పెట్టి కొని, ఏమాత్రం తేడా వచ్చినా ప్ల్యాట్‌ఫార్మ్ మీదకి వచ్చేయ్యాలి అన్న భయంతో ఎవరికి వారు తమిళ నాట కానీ, మరో పక్క ఓవర్‌సీస్ లో కానీ ఈ సినిమాని కొనలేదు అన్న వార్త బలంగా వినిపిస్తున్నప్పటికీ రజని సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అన్న విషయం అందరికీ తెలిసిందే అని, పంపిణీదారుల్లో అంత అమాయకులు ఎవరు లేరు, లైకా వాళ్లే కావాలని ఈ సినిమాని ఆ రెండు చోట్ల సొంతంగా విడుదల చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

లైకా స్కెచ్ అయితే బాగానే ఉంది కానీ, ఎంత పెద్ద సంస్థ అయినా, అంత భారీగా సినిమాను తెరకెక్కించినా, ఇలా అటు తమిళ నాట, ఇటు ఓవర్‌సీస్ లో సినిమాను సొంతంగా రిలీజ్ చేసే సాహసం చెయ్యడం అంటే ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే. ఏమాత్రం తేడా వచ్చినా లైకా ఇబ్బందుల్లోకి వెళ్ళక తప్పదు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే వాళ్ళు పెట్టిన 500 కోట్ల బడ్జెట్ లో మూడో వంతు ఇప్పటికీ ప్రీ బిజినెస్ రూపంలో వాళ్ళు క్యాష్ చేసుకోవడం గమనార్హం.

మరి రజని మ్యాజిక్ లైకాకి వరంగా మారుతుందో, లేక ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి,