Rajinikanth 2.0 Movie distributors safeతమిళ తలైవార్ రజనీకాంత్ రోబో సినిమాకి సీక్వెల్ గా వస్తున్న రోబో-2.0 సినిమా ఇప్పటికీ మూడు సార్లు వాయిదా పడిన కారణంగా ఈ సినిమా డిస్ట్రబ్యూటర్స్ ఇబ్బందులు పడాతారా? అదే జరిగితే ఈ సినిమా కొన్న వారి పరిస్థితి ఏంటి? అసలు రజని మ్యానియా ఎలా పని చెయ్యబోతుంది? అని కాస్త క్లుప్తంగా ఆలోచిస్తే అవును నిజమే రజని సినిమా పలుమార్లు వాయిదా పడిన మాట వాస్తవమే. కొన్ని పర్యాయాలు అయితే అసలు ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందా లేదా అన్న భయం కూడా కలిగింది. కానీ అవేమి ఇప్పుడు లెక్కల్లో లేవు, అందరికీ ఉన్న ఒకే ఒక్క పాయింట్ రజనీకాంత్ సినిమా రోబో-2.0.

అసలు సినిమా ఎందుకు ఇంత లేట్ అయ్యింది? ఏమయ్యింది ఇలాంటివి ఎవ్వడూ పట్టించునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు అంతా ప్రపంచ వ్యాప్తంగా రజని రోబో 2.0 మ్యానియా నడుస్తుంది. ఇక ట్రేడ్ వర్గాలు కూడా అభిమానుల అభిమానంపైనే తమ అంచనాలను చెప్తున్నాయి. సినిమా లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రజని ఏకంగా తొలి రోజే 20 కోట్ల వసూళ్లు సాధించనున్నాడు అని ట్రేడ్ పండితులు లెక్కలు కూడా వేస్తున్నారు. మరో పక్క ఇటు శంకర్, అటు రజని ఇద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి పాసిటివ్ యాంగిల్ ఉండడం ఈ సినిమాకి మారిన ప్లస్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక సహజంగా అటు తమిళంలో భారీ రిలీజ్ కానున్న ఈ సినిమా తొలి రోజు వసూళ్లలో రికార్డు స్థాయిలో నిలబడటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఓవర్‌సీస్ లో కూడా రజనీ మ్యానియా భారీగా ఉండడంతో ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్త వసూళ్లు ఊహకు అందని విధంగా ఉంటాయి అని ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలే వేస్తున్నారు.

మొత్తంగా చూసుకుంటే ఇంకో మూడు రోజుల్లో రజనికాంత్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర మొదలు పెట్టనుండడంతో ఇక ఆ దారిలో వచ్చే చిన్నా, చితకా సినిమాలు పాపం యూ టర్న్ తీసుకుని వేరే దారి చూసుకోవడం బెటర్. ఇంకా చెప్పాలి అంటే ఒక మూడు నుంచి నాలుగు వారాల పాటు చిన్న సినిమా రిలీజ్ కాకుండా ఉంటేనే ఆ సినిమా నిర్మాతలకు మంచిది అని ట్రేడ్ వర్గాలు సైతం సూచిస్తున్నాయి. ఏది ఏమైనా, వాయిదాల పద్దతి వల్ల రజని సినిమాకు ఏమాత్రం ఇబ్బంది కలగదు అని రజని మ్యానియా చూస్తూ ఉంటేనే స్పష్టంగా తెలుస్తుంది. మరి ఎన్ని రికార్డులు తుడుచు పెట్టుకు పోతాయో…ఎన్ని రికార్డులు కొత్తగా రూపం పోసుకుంటాయో “Lets Wait & Watch Robo-2.0”.